జిల్లాలో తాటి, బంబూస్, క్రీపర్స్, ఫెరన్, ఆర్చిడ్స్, అక్వాటిక్ మొక్కలు, టింబర్, గడ్డి, కూరగాలు మరియు పండ్ల చెట్లు ఉన్నాయి. జిల్లాలో పత్లఖవ తప్ప మరెక్కడా విస్తారమైన అరణ్యాలు లేనందువలన వన్యమృగాలు కూడా లేవు. అయినప్పటికీ జిల్లాలో అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. జల్పైగురి జిల్లా మరియు అలిపురుదుయర్ జిల్లాలలోని వన్యమృగ సంరక్షాలయాలు జిల్లాకు సమీపంలోనే ఉన్నాయి. 1976లో కూచ్ బెహర్ జిల్లాలో 217 చ.కి.మీ వైశాల్యంలో " జల్దపరా నేషనల్ పార్క్ " ఏర్పాటుచేయబడింది. .[5] జిల్లా నేషనల్ పార్కును జల్పైగురి జిల్లాతో పంచుకుంటూ ఉంది.[5]